IND Vs SA: నేడు భారత్‌ సౌతాఫ్రికా చివరి వన్డే

IND Vs SA: పరువు దక్కించుకునే ప్రయత్నంలో టీమిండియా

Rama Rao
Published on: 23 Jan 2022 8:04 AM IST
Last ODI  Between India and South Africa Today | Sports News
X

నేడు భారత్‌ సౌతాఫ్రికా చివరి వన్డే

IND Vs SA: సౌతాఫ్రికాతో టీమిండియా తుది సమరం కేప్‌టౌన్‌కు చేరుకుంది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా చివరి వన్డేలోనూ విక్టరీ కొట్టి క్లీన్‌ స్వీప్‌ చేయాలని చూస్తుంది. ఇటు రాహుల్‌ సేన చివరి వన్డేలోనైన గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. తొలి వన్డేలో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోగా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు వరుస విజయాలతో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ వన్డేలోనూ గెలిచి హ్యాట్రిక్ విజయంతో వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలని సౌతాఫ్రికా కోరుకుంటోంది. ఇప్పటి వరకు కేప్‌టౌన్‌లో ఇరు జట్లు 4 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 2 మ్యాచ్‌లు గెలవగా, ఆతిథ్య దక్షిణాఫ్రికా మరో 2 మ్యాచుల్లో విజయం సాధించింది.

Rama Rao

Rama Rao

Next Story