KKB vs RCB: బెంగళూరుపై కోల్కతా విజయం

KKB vs RCB: 81 పరుగుల తేడాతో గెలుపు సాధించిన కోల్కతా

Dhatripriya
Published on: 7 April 2023 8:24 AM IST
Kolkata Win Over Bengaluru
X

KKB vs RCB: బెంగళూరుపై కోల్కతా విజయం

KKB vs RCB: కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్కతా జట్టు సత్తా చాటింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 81 పరుగుల తేడాతో విజయం సాధించించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. శార్థుల్ ఠాగూర్ అద్భుతమైన ఆటతీరుతో 68 పరుగులు నమోదు చేశాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ కోల్కతా వికెట్ కీపర్ గర్బజ్ 57 పరుగులు అందించాడు. రింగు సింగ్ 46 పరుగులు నమోదు చేశాడు. ఏడు వికెట్లను కోల్పోయిన కోల్కతా 204 పరుగులు చేసింది. 205 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 123 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో కోల్కతా జట్టు ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్కతా బ్యాట్స్ మెన్ శార్థుల్ ఠాకూర్ 20 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడు. 29 బంతులు ఎదుర్కొన్న శార్ధుల్ 9 బౌండరీలు, మూడు సిక్సర్లతో 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించి, జట్టువిజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story