IPL 2021 - MI vs KKR: ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన కోల్‌కతా

IPL 2021 - MI vs KKR: *రాణించిన త్రిపాఠి, వెంకటేశ్ *ఏడు వికెట్ల తేడాతో 7 వికెట్ల తేడాతో విజయం

Shireesha
Published on: 24 Sept 2021 8:52 AM IST
Kolkata Knight Riders Won the Match on Mumbai Indians IPL 2021 Second Season | Cricket News Today
X

ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన కోల్‌కతా

IPL 2021 - MI vs KKR: అబుదాబి వేదికగా నడుస్తున్న ఐపీఎల్‌ సెకండ్ సీజన్‌లో కోల్‌కతా కేక పుట్టిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. తమపై చివరి 13 మ్యాచ్‌లో 12 విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్‌ను కోల్‌కతా ఈసారి మట్టికరిపించింది. కేకేఆర్ నయా సంచలనం వెంకటేశ్ అయ్యార్ మెరుపు ఆరంభంతో విజయానికి బాట వేశాడు.. దాంతో కేకేఆర్ విజయం సొంతం అయ్యింది.

ముంబై ఇండియన్స్ పై కోల్‌కతా 7 వికెట్ల తేడాతో గెలిచింది. అలాగే 10 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరి రేసులో తామూ ఉన్నామని చాటుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 6 వికెట్లు కోల్పోయి.. 155 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసిన గెలిచింది.

Shireesha

Shireesha

Next Story