కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి కొత్త ఆటగాడు

Arun Chilukuri
Published on: 22 Oct 2020 8:33 AM IST
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి కొత్త ఆటగాడు
X

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి మరో హిట్టర్ చేరాడు. అమెరికా ఆటగాడు అలీఖాన్‌ గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో న్యూజిలాండ్‌ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ టిమ్‌ సీఫెర్ట్‌ టీంలోకి వచ్చాడు. ఈ విషయాన్ని కోల్‌కతా జట్టు తన అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. టీ20ల్లో 40బంతుల్లో సెంచరీ బాదిన స్టీఫెర్ట్ మరో విధ్వంసానికి స్వాగతం అంటూ ట్వీట్ చేసింది. న్యూజిలాండ్ తరఫున సీఫెర్ట్‌ మూడు వన్డేలు, 24 టీ20లు ఆడాడు. కరీబియన్‌ లీగ్‌లో ట్రింబాగో నైట్‌ రైడర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story