IPL 2022 - Venkatesh Iyer: 20 లక్షల నుండి 8 కోట్లకు.. ఐపీఎల్ నుండి టీమిండియాలోకి

Sandeep Reddy
Published on: 2 Dec 2021 3:24 PM IST
Kolkata Knight Riders Retained All Rounder Venkatesh Iyer with Eight Crore Rupees For IPL 2022
X

IPL 2022 - Venkatesh Iyer: 20 లక్షల నుండి 8 కోట్లకు.. ఐపీఎల్ నుండి టీమిండియాలోకి (ఫైల్ ఫోటో)

IPL 2022 - Venkatesh Iyer: కలకత్తా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని ఆ జట్టు రిటైన్ చేసుకుంది. 20 లక్షల బేస్ ప్రైజ్ తో కలకత్తా నైట్ రైడర్స్ జట్టులోకి అడుగుపెట్టిన వెంకటేష్ అయ్యర్ కేవలం ఒక్క సీజన్ తోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. తాజాగా 8 కోట్ల రూపాయలతో ఐపీఎల్ 2022 కోసం కలకత్తా నైట్ రైడర్స్ యాజమాన్యం అతడిని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2021 లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా ఎంపికైన వెంకటేష్ అటు ఐపీఎల్ లోనే కాకుండా టీమిండియాలోను చోటు సంపాదించాడు. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ టీమిండియా తరపున మూడు మ్యాచ్ లలో ఆడిన వెంకటేష్ అయ్యర్ 36 పరుగులు సాధించాడు.

లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు రైట్ హ్యాండ్ బౌలింగ్ తో ఆల్ రౌండర్ గా అతి తక్కువ సమయంలోనే తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్. ఐపీఎల్ 2021 సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన వెంకటేష్ అయ్యర్ 4 అర్ధ సెంచరీలతో 370 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 67 పరుగులు. 37 ఫోర్లు, 14 సిక్సర్లు ఇందులో ఉన్నాయి. బౌలింగ్ లో 8.3 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తాజాగా వెంకటేష్ అయ్యర్‌, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి లను కలకత్తా జట్టు రిటైన్ చేసుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story