Virender Sehwag: ఆ టీం మ్యాచ్‌లను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలనిపిస్తోంది: సెహ్వాగ్

Virender Sehwag: ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలు పేలవంగా ఆడుతున్నాయి.

Venkata Chari
Published on: 30 April 2021 10:26 PM IST
Kolkata Knight Riders Matches Boring says Virender Sehwag
X

వీరేంద్ర సెహ్వాగ్ (ట్విట్టర్)

Virender Sehwag: ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలు పేలవంగా ఆడుతున్నాయి. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కేకేఆర్ టీం విఫలమవుతూ, విమర్శలపాలవుతోంది. ఈ మేరకు కోల్‌కతా టీం ఆడే మ్యాచ్‌లు చాలా బోర్ కోడుతున్నాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.

శుక్రవారం అహ్మదాబాద్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన చేసింది. దీంతో కోల్‌కతా ఈ ఐపీఎల్‌లో ఐదో ఓటమితో కొట్టుమిట్టాడుతోంది.

''నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. సినిమాలు చూసేప్పుడు బోర్‌ సీన్స్ వస్తే.. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా మ్యాచ్‌లు బోర్ కోడుతున్నాయి. కోల్‌కతా మ్యాచ్‌లను వేగంగా ఫార్వర్డ్ చేసి చూడాలి. చేసిన తప్పులనే మరలా చేస్తూ విసుగు తెప్పిస్తున్నారని '' వీరూ అన్నాడు.

''కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్‌ విషయంలో నేనిప్పటికీ సంతోషంగా లేను. ఎందుకంటే నితీశ్‌ రాణా ఓపెనింగ్ చేస్తున్నాడు. అతడు ఓపెనింగ్ చేయనవసరం లేదు. శుభమన్ గిల్ దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 40 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కానీ, ఎక్కువ బంతులు ఆడాడు. ఇది మంచిదే అయినా రన్‌రేట్‌ పడిపోకుండా ధాటిగా ఆడే ఆటగాడు అతనికి జతగా ఉండాలి'' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story