DC vs KKR: విశాఖ వేదికగా కోల్‌కతా గ్రాండ్‌ విక్టరీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ చిత్తు

DC vs KKR: 106 పరుగుల తేడాగా ఘన విజయం సాధించిన కోల్‌కతా

Jyothi
Published on: 4 April 2024 7:37 AM IST
Kolkata Knight Riders beat Delhi Capitals by 106 runs
X

DC vs KKR: విశాఖ వేదికగా కోల్‌కతా గ్రాండ్‌ విక్టరీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ చిత్తు 

DC vs KKR: ఐపీఎల్‌-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దూకుడు కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన ఆ జట్టు.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించింది. విశాఖలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ 106 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట సునీల్‌ నరైన్‌, రఘువంశీ , రసెల్‌ చెలరేగడంతో కోల్‌కతా 7వికెట్లకు 272 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో నోకియా 3, ఇషాంత్‌ 2వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి , మిచెల్‌ స్టార్క్‌ఆ జట్టును దెబ్బ తీశారు. రిషబ్‌ పంత్‌ ట్రిస్టియన్‌ స్టబ్స్‌ పోరాడిన ఓటమి తప్పలేదు. 4 మ్యాచ్‌ల్లో ఢిల్లీకిది మూడో ఓటమి కాగా. కోల్‌కతా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది.

Jyothi

Jyothi

Next Story