DC VS KKR: ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం

DC VS KKR: 7 వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్‌కతా

Shashank Gullapelli
Published on: 30 April 2024 8:47 AM IST
Kolkata Had A Huge Win Over Delhi Capitals
X

DC VS KKR: ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం

DC VS KKR: పటిష్ట గుజరాత్, ముంబై జట్లను ఓడించి జోరు మీద కనిపించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్.. కోల్‌క‌తాపై ఆ దూకుడు కనపరచలేకపోయింది. ఘోరంగా పరాజయం పాలై నెట్ రన్‌రేట్‌ను దెబ్బ తీసుకుంది. ఈడెన్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్‌క‌తా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఢిల్లీ 153 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని కోల్‌క‌తా ఓపెనర్ ఫిల్ సాల్ట్ఉఫ్ మని ఊదేశాడు. క్యాపిట‌ల్స్ బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. అతని ధాటికి కోల్‌క‌తా మరో 21 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది. అంతకుముందు సొంతగడ్డపై కోల్‌క‌తా బౌలర్లు విజృంభించడంతో ఢిల్లీ 153 పరుగులకే పరిమితమైంది. 35 పరుగులు చేసిన కుల్దీప్‌ యాదవ్ ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story