IPL 2023: కోహ్లి-గంభీర్‌కు ఐపీఎల్ భారీ షాక్.. 100 శాతం జరిమానా..!

Kohli, Gambhir Fined 100% of Their Match Fees for Ugly Fight in IPL 2023
x

IPL 2023: కోహ్లి-గంభీర్‌కు ఐపీఎల్ భారీ షాక్.. 100 శాతం జరిమానా..!

Highlights

Kohli-Gambhir: లఖ్ నవూ సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

Kohli-Gambhir: లఖ్ నవూ సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత నెలలో బెంగళూరులో జరిగిన మ్యాచ్ సందర్భంగా లఖ్ నవూ మెంటార్ అయిన గౌతమ్ గంభీర్..బెంగళూరు ప్రేక్షకుల వైపు చూస్తూ నోటికి తాళాలు వేసుకోవాలంటూ సంజ్ఞలు చేశాడు. ఈ మ్యాచ్ లో లఖ్ నవూ టీమ్ బెంగళూరును ఓడించింది. కట్ చేస్తే నిన్న జరిగిన మ్యాచ్ లో లఖ్ నవూను కోహ్లీ సేన ఓడించింది. లఖ్ నవూ ఆటగాడు కృనాల్ క్యాచ్ ను అందుకున్న కోహ్లీ..ప్రేక్షకుల వైపు తిరిగి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అంతేకాదు లఖ్ నవూ వికెట్ పడిన ప్రతీసారీ రెచ్చిపోయి సంబరాలు చేసుకున్నాడు.

ఇక మ్యాచ్ అనంతరం ఇరు జట్ల మధ్య ఆటగాళ్లు షేక్ హ్యండ్ ఇచ్చుకునే క్రమంలో గంభీర్-కోహ్లీ మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇద్దరు తగ్గకుండా మాటా మాటా అనుకోవడంతో గొడవకు దారి తీసింది. దీంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పాల్సి వచ్చింది. కోహ్లీని అమిత్ మిశ్రా సముదాయించగా..గంభీర్ ను కేఎల్ రాహుల్ శాంతపరిచాడు. ఈ వివాదం చూసినవాళ్లు..బెంగళూరు వేదికగా లఖ్ నవూ, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ చేసిన అతికి తాజా మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బదులిచ్చే ప్రయత్నం చేశాడని అనుకున్నారు. అయితే వీరిద్దరి మధ్యన వివాదం ఈ నాటిది కాదు. 2013లో కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న గంభీర్ తో కోహ్లీకి తొలిసారి గొడవ జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఫైట్ కంటిన్యూ అవుతోంది. అవకాశం వచ్చినప్పుడల్లా కోహ్లీని గంభీర్ విమర్శిస్తూనే ఉన్నాడు.

తాజా వివాదంపై ఐపీఎల్ నిర్వాహకులు సీరియస్ అయ్యారు. మ్యాచ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు లఖ్ నవూ సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ తో పాటు ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీపై జరిమానా విధించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఐపీఎల్ యాజమాన్యం..ఇరువురి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. అలాగే లఖ్ నవూ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ పై కూడా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories