
KL Rahul: లీడ్స్ టెస్ట్‌లో సెంచరీ కొట్టి... టీమిండియాపైనే కేఎల్ రాహుల్ అసంతృప్తి?
KL Rahul: లీడ్స్ టెస్ట్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. టీమిండియా స్కోర్‌బోర్డ్‌ను భారీగా పెంచి, ఇంగ్లాండ్‌కు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.
KL Rahul: లీడ్స్ టెస్ట్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. టీమిండియా స్కోర్‌బోర్డ్‌ను భారీగా పెంచి, ఇంగ్లాండ్‌కు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో అంత బాగా ఆడిన తర్వాత, లీడ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ "నేను నా పొజిషన్‌ను మర్చిపోయాను" అని ఎందుకు అన్నాడు? అలా అనడం ద్వారా అతను టీమిండియాపైనే అసంతృప్తి వ్యక్తం చేశాడా? ఒకవేళ అదే నిజమైతే, టీమిండియాలో అతన్ని బాధపెట్టిన విషయం ఏంటి? లీ ఆ వ్యాఖ్యలు ఇప్పుడు టీమిండియా వ్యూహాలపైనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
కేఎల్ రాహుల్ అసలేం అన్నాడు? లీడ్స్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, "గత కొన్ని సంవత్సరాలుగా నేను నా పొజిషన్‌ను మర్చిపోయాను" అని చెప్పాడు. ఇక్కడ "పొజిషన్" అంటే బ్యాటింగ్ పొజిషన్ అని తన ఉద్దేశం. కొన్నిసార్లు అతన్ని ఓపెనింగ్‌కు పంపేవారు, కొన్నిసార్లు నంబర్ 3, మరికొన్నిసార్లు నంబర్ 5... ఇలా ఏ ఆర్డర్‌లో పడితే ఆ ఆర్డర్‌లో ఆడించారని రాహుల్ పరోక్షంగా పేర్కొన్నాడు. ఈ సందర్భంలో అతను తన అభిప్రాయం చెప్పినప్పుడు, భారత క్రికెట్ థింక్ ట్యాంక్ ఆలోచనలపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాడా అనిపించింది.
అయితే, తర్వాతి క్షణంలోనే అతను ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. "నాకు ఏ బాధ్యత అప్పగించినా, దాన్ని నేను నిర్వర్తించాను. దానివల్ల నాకు నన్ను నేను సవాల్ చేసుకునే అవకాశం లభించింది. నేను ఆ అవకాశాలను పూర్తిగా ఎంజాయ్ చేశాను" అని అన్నాడు. అంటే, తనకు స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ లేకపోవడంపై కొంత అసంతృప్తి ఉన్నా, ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించానని చెప్పకనే చెప్పాడు. లీడ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 247 బంతుల్లో 137 పరుగులు చేశాడు. అతని సెంచరీతోనే టీమిండియా ఇంగ్లాండ్‌కు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




