India vs Engalnd: వారిద్దరే ఓపెనింగ్ జోడీ: కోహ్లీ

India vs Engalnd: ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా.

Venkata Chari
Published on: 11 March 2021 8:55 PM IST
KL Rahul to open with Rohit Sharma in the first T20I
X
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (ఫొటో ట్విట్టర్)

India vs Engalnd: ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా. కాగా, రేపటి నుంచి ఐదు టీ20ల సిరీస్‌కు మొదలుకానుంది. శుక్రవారం​ నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈమేరకు నిర్వహించిన ప్రెస్ కాన్సరెన్స్‌లో కోహ్లీ మాట్లాడాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్‌ శర్మతో​ కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌కు దిగుతాడని విరా‌ట్ పేర్కొన్నాడు.

రోహిత్, రాహుల్ ఇద్దరిలో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాల్సి వస్తే శిఖర్‌ ధావన్‌ మూడో ఓపెనర్‌గా ఆడతాడు. ఇప్పటికైతే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఓపెనర్లు. టీం ఇండియాలో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి మా బ్యాట్స్‌మెన్‌ మరింత స్వేచ్ఛగా ఆడతారు అని తెలిపాడు.

కాగా, ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ టీం ఫేవరేట్‌ అని కోహ్లి అన్నాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌.. టీమిండియానే ఫేవరెట్‌ అని అభిప్రాయపడగా, కోహ్లి మాత్రం ఇంగ్లండ్‌ ఫేవరెట్‌ అని చెప్పడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహించడానికి ఐసీసీ సన్నద్ధమవుతోంది.


Venkata Chari

Venkata Chari

Next Story