మూడో టెస్ట్ ముందు టీమిండియాకు భారీ షాక్

Arun Chilukuri
Updated on: 5 Jan 2021 9:00 PM IST
మూడో టెస్ట్ ముందు టీమిండియాకు భారీ షాక్
X

కంగారూలతో మూడో టెస్టుకు సిద్ధమవుతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీసు​చేస్తున్న రాహుల్ గాయపడ్డాడు. ఎడమచేతి మణికట్టుకు గాయం కావడంతో పూర్తిగా సిరీస్ నుంచి వైదొలిగాడు. త్వరలోనే అతను స్వదేశానికి పయనం కానున్నాడు. దీనికి సంబంధించి బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. గాయం నుంచి కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని దీంతో అతను సిరీస్‌కు దూరం అవుతున్నాడని ప్రకటించింది. మిగతా టెస్టులకు రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడనుకున్నారంతా ! రోహిత్, రాహుల్ అదరగొట్టేస్తారని భావించిన అభిమానులకు షాక్ తగిలినట్లు అయింది. సిరీస్ ఆరంభం నుంచి టీమిండియాను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయ్. ఇప్పటికే ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ గాయాల కారణంగా సిరీస్ నుంచి వైదొలిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story