KL Rahul: ఐపీఎల్ కు కేఎల్‌ రాహుల్‌ దూరం.. టెస్ట్ చాంపియన్ షిప్ కు కూడా డౌటే..?

KL Rahul: లఖ్ నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా అతడు చెన్నై మ్యాచ్ కు దూరం అయ్యాడు.

Arun Chilukuri
Updated on: 3 May 2023 5:30 PM IST
KL Rahul Ruled Out of IPL 2023 Season
X

KL Rahul: ఐపీఎల్ కు కేఎల్‌ రాహుల్‌ దూరం.. టెస్ట్ చాంపియన్ షిప్ కు కూడా డౌటే..?

KL Rahul: లఖ్ నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా అతడు చెన్నై మ్యాచ్ కు దూరం అయ్యాడు. తదుపరి మ్యాచ్ కు రాహుల్ అందుబాటులోకి వచ్చేస్తాడని టీమ్ భావించింది. కానీ పరిస్థితి అలా లేదు. అతడు టోర్నీ మొత్తానికి దూరం అయ్యేలా ఉన్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపేందుకు పరిగెడుతూ..గ్రౌండ్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తొడ కండరానికి గాయం కావడంతో అతడు మైదానంలో చాలా ఇబ్బందిపడ్డాడు. ఫిజియోలు వచ్చి అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత లఖ్ నవూ బ్యాటింగ్ ఆర్డర్ లో చివర్లో వచ్చిన రాహుల్...పరుగులు తీసేందుకు చాలా ఇబ్బందిపడ్డాడు.

రాహుల్ గాయంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. అతడికి ముంబైలో స్కానింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. రాహుల్ తో పాటు ఇటీవలే గాయపడ్డ ఉనద్కత్ పరిస్థితిని సైతం బీసీసీఐ సమీక్షిస్తోంది. ఇకపోతే జూన్ 7 నుంచి 11 వరకు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు రాహుల్ అందుబాటులో ఉంటాడో లేదో అనేది సస్పెన్స్ గా మారింది. అలాగే భుజం గాయంతో సతమతమౌతున్న జయ్ దేవ్ ఉనద్కత్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story