KL Rahul: ఓపెనింగ్ జోడీ రహస్యాన్ని వెల్లడించిన కెఎల్‌ రాహుల్‌

* ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు టీ20లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది ఐదోసారి.

hmtv Digital Team
Published on: 20 Nov 2021 11:32 AM IST
KL Rahul Reveals Opening Pair Secret
X

 ఓపెనింగ్ జోడీ రహస్యాన్ని వెల్లడించిన కెఎల్‌ రాహుల్‌(ఫైల్ ఫోటో)

KL Rahul: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టీ 20 మ్యాచ్‌లలో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 153 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ మరో 16 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. అయితే భారత్ విజయంలో ఓపెనింగ్ జోడీ కీలక పాత్ర పోషించింది.

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ తమ ఇన్నింగ్స్ ఆధారంగా టీమ్ ఇండియా విజయాన్ని నిర్ణయించారు. ఈ మ్యాచ్‌ ద్వారా రోహిత్‌-రాహుల్‌లు భారీ రికార్డు సృష్టించారు.

ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు టీ20లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది ఐదోసారి. ఈ సందర్భంగా రోహిత్ శర్మతో జతకట్టడం గురించి రాహుల్ పలు విషయాలు వెల్లడించాడు. రోహిత్‌ వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్

రోహిత్ బ్యాటింగ్‌కు తాను పెద్ద అభిమానినని అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టమని కెఎల్‌ రాహుల్‌ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన రాహుల్‌ ఈ విధంగా మాట్లాడాడు. 'రోహిత్‌, నేనూ కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాం.

అతని బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతను అద్భుతమైన బ్యాట్స్‌మెన్. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎదుటివారిపై ఒత్తిడి పడకుండా చూస్తాడు. అందుకే ఇద్దరం కలిసి విజయవంతంగా రాణిస్తున్నాం' అని చెప్పాడు. ఇదిలా ఉంటే రోహిత్ మొదటి మ్యాచ్‌లో కూడా రాణించాడు.

hmtv Digital Team

hmtv Digital Team

Next Story