India Vs England Test: మయాంక్ ఔట్.. రాహుల్ ఇన్.. భారత తుది జట్టు..!!

Sandeep Reddy
Published on: 3 Aug 2021 4:07 PM IST
KL Rahul Replaced The Mayank Agarwal Place And Team India Playing Eleven May be Like This in India Vs England Test Match
X

భారత తుది జట్టు (ట్విట్టర్ ఫోటో)

India Vs England Test: బుధవారం ఇంగ్లాండ్ తో జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ని దించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే నాటింగ్ హోమ్ పిచ్ ఎక్కువ గడ్డితో ఉండి ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలిస్తుందనే టీం ఇండియా జట్టు ఈ నిర్ణయం తీసుకోబోతుంది. ఇక భారత జట్టులో ఓపెనర్ గా మయాంక్ అగర్వాల్ రోహిత్ శర్మతో బ్యాటింగ్ కి దిగుతాడని మొదట అనుకున్న తాజాగా నిన్న జరిగిన ప్రాక్టీసు మ్యాచ్ లో సిరాజ్ వేసిన బంతికి మయాంక్ హెల్మెట్ కి తగలడంతో గాయపడిన మయాంక్ మొదటి టెస్ట్ మ్యాచ్ కి దూరమయ్యాడనే విషయాన్నీ బీసీసీఐ కూడా అధికారికంగా ప్రకటించింది.

దీంతో కే ఎల్ రాహుల్ కి ఓపెనర్ గా అవకాశం లభించింది. ఇక టీమిండియా జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా అజింక్య రహనే వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. మరోపక్క ఇంగ్లాండ్ జట్టులో బెన్ స్టొక్స్ లేకపోవడం ఆ టీంకి పెద్ద దెబ్బే అని చెప్పొచు. ఇక జో రూట్ ఇంగ్లాండ్ టీం కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా తాజాగా పిచ్ పై ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలు పలువురు క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక టీమిండియా మరియు ఇంగ్లాండ్ ల తుది జట్లు ఇలా ఉండబోతున్నాయి.

భారత జట్టు: రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజిక్య రహనే, రిషబ్ పంత్, జడేజా/అశ్విన్, ఇషాంత్ శర్మ/ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా

ఇంగ్లాండ్ జట్టు: రోరి బర్న్స్ ,డొమినిక్ సిబ్లే, బేర్ స్టౌ, జో రూట్ (కెప్టెన్), డానియల్ లారెన్స్, ఒల్లీ పొప్, సామ్ కర్రన్, ఒల్లీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story