KKR vs SRH: ఐపీఎల్ ఫైనల్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్
KKR vs SRH: 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్
KKR vs SRH: ఐపీఎల్ ఫైనల్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్
KKR vs SRH: ప్లేఆఫ్స్‌లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతా భారీ విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విక్టరీ సాధించింది. దీంతో కోల్‌కతా టీమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్ త్రిపాఠి 55 హాఫ్ సెంచరీ చేయగా, క్లాసెన్ 32 పరుగులు చేశారు.
కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ 3, చక్రవర్తి 2, అరోరా, రాణా, నరైన్, రస్సెల్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగుల వద్ద లక్ష్యాన్ని ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ 51 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 58 పరుగులు చేసి విజయం కీ రోల్ పోషించారు.
Next Story




