IPL 2023: గుజరాత్‌కు బిగ్‌ షాక్‌.. ఐపీఎల్ మొత్తానికి కేన్ విలియమ్సన్ దూరం..

IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్‌లో గెలుపు జోష్‌ మీద ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది.

Arun Chilukuri
Published on: 1 April 2023 1:14 PM IST
Kane Williamson Ruled Out For IPL 2023 Entire Season
X

IPL 2023: గుజరాత్‌కు బిగ్‌ షాక్‌.. ఐపీఎల్ మొత్తానికి కేన్ విలియమ్సన్ దూరం..

IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్‌లో గెలుపు జోష్‌ మీద ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ .. ఈ మెగా టోర్నీ మొత్తం దూరం కానున్నట్లు తెలుస్తోంది.

సీఎస్కే ఇన్సింగ్స్ 13వ ఓర్లో జోషువా లిటిల్ వేసిన బంతిని చెన్నై సూపర్ కింగ్స్ ఓపెననర్ రుతురాజ్ గైక్వాడ్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. ఈక్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్ గాల్లోకి ఎగిరి దాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే తను బ్యాలెన్స్‌ తప్పానని గ్రహించిన కేన్ విలియమ్సన్ బంతిని మైదానంలో విసిరేసి తన జట్టుకు రెండు పరుగులను సేవ్‌చేశాడు. అయితే బంతిని అపే క్రమంలో అతడి మోకాలు నేలను బలంగా తాకింది. దీంతో నొప్పితో అతడు విల్లావిల్లాడు. వెంటనే అక్కడికి గుజరాత్ ఫిజియోలు వచ్చారు. చాలా సేపటి వరకు కూడా కేన్ విలియమ్సన్ ను తన కుడి కాలిని పూర్తిగా చాపలేకపోయాడు. చాలా సేపటి తర్వాత ఫిజియోలు నెమ్మదిగా అతడి కాలిని స్ర్టయిట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి సాయంతో కేన్ మామ డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు.

కాగా విలియమ్సన్ గాయం తీవ్రతపై గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ క్రిస్టన్ చేసిన వాఖ్యల ప్రకారం కేన్ మామా ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. విలియమ్సన్ కు మోకాలికి తీవ్ర గాయమైంది.. అతడిని మా ఫిజియోలు పరిశీలిస్తున్నారు.. కేన్ ను స్కానింగ్ కు కూడా పంపించారు అంటూ తెలిపాడు. రిపోర్ట్స్‌ వచ్చాక గాయం తీవ్రత తెలుస్తోంది. అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాడు అని ఆశిస్తున్నాను అని కిర్‌స్టన్‌ పేర్కొన్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story