Kane Williamson: లిటిల్ మ్యాన్‌కు స్వాగతం అంటూ..

Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు.

Arun Chilukuri
Updated on: 23 May 2022 7:30 PM IST
Kane Williamson Blessed With a Baby Boy
X

Kane Williamson: లిటిల్ మ్యాన్‌కు స్వాగతం అంటూ..

Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. ఇటీవలే జన్మించిన తన కొడుకు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి మురిసిపోతున్నాడు. ఐపీఎల్ 2022 ఆడుతున్న సమయంలో కేన్ భార్య సారా రహీమ్ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. విషయం తెలియడంతో కేన్ విలియమ్సన్ వెంటనే న్యూజీలాండ్‌కు బయలుదేరి వెళ్లాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే కేన్ స్వదేశానికి పయనమయ్యాడు. ఆ తర్వాత సారా రహీమ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భార్య కుమారుడిని ఎత్తుకున్న ఫోటోను కేన్ షేర్ చేశాడు. లిటిల్ మ్యాన్‌కు స్వాగతం పలుతున్నామంటూ కామెంట్ చేశాడు. ఫ్యాన్స్, ఫ్రెండ్స్ కేన్ విలియమ్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story