Bumrah Marriage: ఈనెల 14న జస్ప్రీత్‌ బుమ్రా వివాహం..?

Bumrah Marriage: టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్‌బుమ్రా ఈనెల 14న గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు ఓ వార్త హల్ చ‌ల్ చేస్తుంది.

Venkata Chari
Published on: 9 March 2021 6:22 PM IST
Jasprit Bumrah Marriage with sports presenter Sanjana Ganeshan
X

జస్ప్రీత్ ‌బుమ్రా, సంజనా గణేశన్‌ (ఫొటో ట్విట్టర్,ఇన్‌స్టాగ్రాం)

Bumrah Marriage: టీమ్‌ఇండియా పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈనెల 14న గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తుంది. గతంలో హీరోయిన్ రాశీఖన్నాతో బుమ్రా లవ్‌లో ఉన్నాడని, ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్‌గా మారాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీతా పరమేశ్వరన్. అనుపమ, బుమ్రా కేవలం స్నేహితులు మాత్రమేనని, వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల్లో నిజం లేదంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి బుమ్రా పెళ్లి వార్త ఆసక్తి రేపింది.

తాజాగా, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్‌ను బుమ్రా వివాహం చేసుకోబోతున్నాడని తాజా సమాచారం. అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ నెల 14న గోవాలో పెళ్లిపీటలు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు బుమ్రా వ్యక్తిగత కారణాలతో లీవ్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బుమ్రాకు వివాహం కుదిరిందనే వార్తలు తెగ సందడి చేస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే టీమ్‌ ఇండియా పేసర్‌ ఇక ఇంగ్లాండ్‌తో టీ ట్వంటీ క్రికెట్‌కు అందుబాటులో ఉండడు.

Venkata Chari

Venkata Chari

Next Story