ISL League 2021: ముంబై సిటీ, మోహన్ బగాన్ మధ్య ఫైనల్ పోరు

ISL League 2021: ఇండియన్ సూపర్ లీగ్(ISL)ఏడో సీజన్‌ చివరి అంఖానికి చేరుకుంది.

Samba Siva Rao
Published on: 13 March 2021 1:28 PM IST
Indian Super League
X

ISL FINAL 

ISL League 2021: ఇండియన్ సూపర్ లీగ్(ISL)ఏడో సీజన్‌ చివరి అంఖానికి చేరుకుంది. ముంబై సిటీ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ జట్లు ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీఫైనల్లో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో ముంబై జట్టు, ఎఫ్‌సీ గోవాను ఓడించి ఫైనల్‌కు చేరేంది. ఇక లీగ్ దశలో ఏటీకే మోహన్ బగాన్ జట్టు నార్త్ ఈస్ట్ ఎఫ్‌సీ పై విజయం సాధించి పైనల్లోకి అడుగుపెట్టింది. ఈ రెండు జట్లు లీగ్ దశలో ముంబై సిటీ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ జట్లు కేవలం నాలుగు మ్యాచులే కొల్పోయి.. చెరో 12 విజయాలు ఖాతాలో వేసుకున్నాయి. శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకోవాలని రెండు జట్లు తహాతహాలాడుతున్నాయి.

ముంబై జట్టు ఏటీకే మోహన్ బగాన్‌పై రెండుసార్లుపై చేయి సాధించింది. ముంబై పూర్తి విశ్వాసంతో ఉంది. లీగ్ విన్నర్స్ షీల్డ్ గెలిచిన ఆ జట్టు అదే ఊపును కొనసాగిస్తూ ఫస్ట్ టైమ్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే పేరు మార్చుకొని ఈ సీజన్‌లో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంప్ ఏటీకే అంచనాలను అందుకుంటూ ముందుకొచ్చింది. నాకౌట్ గేమ్స్‌లో అద్భుతమైన రికార్డు ఆ జట్టు సొంతం చేసుకున్నఏటీకే.. ముంబైని మూడో సారి ఓడించి తొలి టైటిల్ ఏటీకే మోహన్ బగాన్‌ అందుకోవాలని చూస్తోంది.

మూడు సార్లు విన్నర్‌గా నిలిచిన ఏటీకే మోహన్ బగాన్‌ ముచ్చటగా నాలుగో టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీలో 114 మ్యాచ్‌లు, 295 గోల్స్, 87,811 పాసెస్, 7307 ట్యాకిల్స్ ఉన్నాయి. ఈ టోర్నీలో నార్త్ ఈస్ట్, గోవా మూడు నాలుగో స్థానాల్లో నిలిచాయి. చివరి స్థానంలో ఒడిశా ఏఫ్‌సీ నిలిచింది. ఏటీకే మోహన్ బగాన్‌ 20 మ్యాచుల్లో 12 విజయాలు, నాలుగు డ్రాలు, 4 ఓటములు ఉన్నాయి. ముంబై సిటీ జట్టు 20 మ్యాచుల్లో 12 విజయాలు, నాలుగు డ్రాలు, 4 ఓటములు ఉన్నాయి. దీంతో రెండు జట్లు చెరో 40 పాయింట్లతో సమానంగా నిలిచాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story