Rishab Pant: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పంత్‌ హవా

Rishab Pant: ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో టీం ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్ దుమ్ము రేపాడు.

Venkata Chari
Published on: 5 May 2021 8:41 PM IST
Rishab Pant Rises 6th Rank in ICC Test Rankings
X

రిషబ్ పంత్ (ఫొటో దిహన్స్ ఇండియా)

Rishab Pant: ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో టీం ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్ దుమ్ము రేపాడు. బుధవారం ప్రకటించిన ర్యాకింగ్స్‌లో రిషబ్ 6వ స్థానం దక్కించుకున్నాడు. గతేడాది ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన పంత్.. తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌ టెన్‌లోకి దూసుకొచ్చాడు. ఆ తరువాత ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ సత్తా చాటడంతో 747 పాయింట్లతో ఆరో స్థానంలోకి దూసుకెళ్లాడు. ఒక స్థానం ఎగబాకి తన కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(814 పాయింట్లు) ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా రిషబ్‌ పంత్‌ హెన్రీ నికోలస్‌, రోహిత్‌ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

అలాగే 878 పాయింట్లతో మార్నస్‌ లబుషేన్‌ మూడు, జో రూట్‌ 831 పాయింట్లతో నాలుగో స్థానాలకు పరిమితమయ్యారు. ఇక పాక్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ మూడు స్థానాలు దిగజారి 736 పాయింట్లతో 9వ స్థానం దక్కించుకున్నాడు. డేవిడ్‌ వార్నర్‌ 724 పాయింట్లతో 10వ స్థానం సంపాదించుకున్నాడు.


Venkata Chari

Venkata Chari

Next Story