Lalit Modi: సుస్మితా సేన్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించిన లలిత్ మోదీ

*లలిత్ మోదీతో, సుస్మిత సేన్‌ డేటింగ్‌... భవిష్యత్తులో పెళ్లి కూడా..

Rama Rao
Published on: 15 July 2022 12:13 PM IST
IPL founder Lalit Modi Announces He is Dating Sushmita Sen
X

Lalit Modi: సుస్మితా సేన్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించిన లలిత్ మోదీ

Lalit Modi-Sushmita Sen: బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు భారత మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీ ప్రకటించారు. సుస్మితా సేన్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇటీవలే తనతో కలిసి ప్రపంచ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో లలిత్‌ మోదీ స్పష్టత ఇస్తూ మరో ట్వీట్‌ చేశారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం కలిసి డేటింగ్‌ మాత్రమే చేస్తున్నాం. భవిష్యత్తులో పెళ్లి కూడా జరగవచ్చు.. అని ట్వీట్‌ చేశారు. తనతో కలిసి ఉన్న ఫొటోలను పోస్టు చేశారు.

బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు వాళ్లిద్దరూ కలిసి డేటింగ్‌ చేశారు. అయితే కొన్ని కారణాలతో వాళ్లిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్‌ చెప్పారు. మరోవైపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్‌ మోదీ 2010 నుంచి లండన్‌లో ఉంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story