IPL 2023: హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్.. నేడు ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌

IPL 2023: హైదరాబాద్‌ వర్సెస్ రాజస్థాన్‌ మధ్య పోరు

Dhatripriya
Published on: 2 April 2023 10:40 AM IST
IPL Fever In Hyderabad Today IPL Match At Uppal Stadium
X

IPL 2023: హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్.. నేడు ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌

IPL 2023: హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే రెండు టీమ్‌లు హైదరాబాద్ చేరుకున్నాయి. ఇక.. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్, రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్రాక్టీస్ చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు.. వారం ముందే అమ్ముడుపోయాయి. ఇక.. ఈ మ్యాచ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సీపీ చౌహాన్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. స్టేడియం మొత్తం నిఘాలో ఉంటుందని స్పష్టం చేశారు సీపీ చౌహాన్. కాగా.. ఈ సీజన్ లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచులు జరుగనున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story