IPL 2024: ఐపీఎల్ చోకర్స్ ముద్ర పోయేనా.. ఆర్‌సీబీ రాత ఈ ఏడాదైనా మారేనా?

IPL 2024 Will RCB Win The Trophy This Year
x

IPL 2024: ఐపీఎల్ చోకర్స్ ముద్ర పోయేనా.. ఆర్‌సీబీ రాత ఈ ఏడాదైనా మారేనా?

Highlights

IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రముఖ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ.

IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రముఖ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ. ప్రపంచంలోనే అత్యధికంగా అభిమానులను అనుసరించే జట్లలో ఒకటిగా పేరుగాంచింది ఆర్‌సీబీ. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఆర్‌సీబీ జట్టు కోసం ఆడారు, ఆడుతున్నారు. అనిల్ కుంబ్లే, షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేనియల్ వెట్టోరి ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్‌గా సెట్ చేసుకుంది. ఆర్‌సీబీ జట్టు యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా 2008లో స్థాపించారు. 2008లో జరిగిన వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీని విజయ్ మాల్యా సుమారు రూ.9,250 కోట్లకు కొనుగోలు చేశారు. 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రాండ్ విలువ సుమారు రూ.16,163 కోట్లకు చేరింది.

కెప్టెన్లు మారినా, ఫేట్ మారలే..

ఇక ఆర్‌సీబీ కెప్టెన్ల గురించి మాట్లాడితే.. 2008లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో బరిలోకి దిగింది. విరాట్ కోహ్లీ 2011 నుంచి 2021 వరకు RCB కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఫాఫ్ డు ప్లెసిస్ సారథిగా ఉన్నాడు. అయితే, కెప్టెన్లు మార్చినా, స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు IPL ట్రోఫీని ఎన్నడూ గెలవలేకపోయింది. 16 ఏళ్ల ప్రస్థానంలో చెప్పుకోదగిన సీజన్‌లు కేవలం మూడే ఉన్నాయి. 2009, 2016 మధ్య మూడు సందర్భాలలో రన్నరప్‌గా నిలిచి ఫ్యాన్స్‌కు కాస్త ఊరటనిచ్చింది.

రికార్డ్..

ఆర్‌సీబీ జట్టు పేరు మీద రెండు ముఖ్యమైన రికార్డులు ఉన్నాయి. మొదటి రికార్డు IPL చరిత్రలో పూణే వారియర్స్ ఇండియాపై 2013లో చేసిన అత్యధిక స్కోరు. ఇక రెండవది KKRపై కేవలం 49 పరుగులకే ఆల్‌టై చెత్త స్కోరు నమోదు చేసింది.

అయితే, IPL మొదటి సీజన్ RCBకి చాలా చెడ్డదిగా మారింది. తొలి సీజన్ ముగింపులో ఆర్‌సీబీ జట్టు ఏడవ స్థానంలో నిలిచింది. తొలి IPL మ్యాచ్‌లో KKR చేతిలో 140 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది.

కీలక విజయాలు..

IPL ప్రతి సీజన్‌ ప్రారంభంలో ఆర్‌సీబీపై భారీ అంచనాలు ఉంటాయి. ప్రతీసారి ఈ అంచనాలను అందుకోవడంలో కోహ్లీ టీం తడబడుతూనే ఉంది. కాగితంపై బలంగా కనిపిస్తున్న ఆర్‌సీబీ జట్టు.. ఇప్పటివరకు ఒక్క IPL టైటిల్‌ను కూడా గెలుచుకోలేకపోయింది. 2009, 2016 సీజన్‌లలో ఫైనల్స్‌కు చేరినా.. దురదృష్టవశాత్తు కోహ్లీ జట్టు ట్రోఫీని అందుకోలేకపోయింది.

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ 164 మ్యాచ్‌ల్లో 37.53 సగటుతో మొత్తం 4842 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ 102, క్రిస్ గేల్ 91 మ్యాచ్‌లు ఆడి రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. క్రిస్ గేల్ 2011లో 608 పరుగులు, 2012 సీజన్‌లో 733 పరుగులతో వరుసగా రెండుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఇక విరాట్ 2016 సీజన్‌లో రికార్డు స్థాయిలో 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.

జట్టు హిస్టరీ..

తొలి సీజన్‌లో ఏడవ స్థానంలో నిలిచిన RCB.. ఆ తదుపరి సీజన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఫైనల్స్‌లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓడిపోయింది. 2016లో టైటిల్ కోసం బలమైన పోటీదారుగా మారిన ఆర్‌సీబీ జట్టు.. మరోసారి ఓటమిని రుచిచూడాల్సి వచ్చింది. దీంతో ఐపీఎల్ లీగ్‌లో చోకర్స్‌గా మిగిలిపోతున్నారు.

ఫ్యాన్స్‌లో ఏమాత్రం తగ్గని అభిమానం..

RCB ఇప్పటి వరకు IPL ట్రోఫీని గెలుచుకోలేదు. అయినా, అభిమానులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. కోహ్లీ ఒక్కసారైనా ట్రోఫీని ముద్దాడితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ప్రారంభం కాకముందునుంచే ‘ఈ సాలా కప్ నామ్దే’ అంటే ‘ఈ సంవత్సరం కప్ మాదే’ అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సందడి చేస్తుంటారు. అయితే, ప్రత్యర్థి జట్ల ఫ్యాన్స్ మాత్రం ఇదే స్లోగన్‌తో ఎగతాళి చేస్తుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories