IPL 2023: ఐపీఎల్- 2023 షెడ్యూల్ విడుదల.. మార్చి 31న ప్రారంభం

IPL 2023: మార్చి 31న గుజరాత్- చెన్నై మధ్య తొలి మ్యాచ్

Jyothi
Updated on: 17 Feb 2023 6:04 PM IST
IPL-2023 Schedule Release
X

IPL 2023: ఐపీఎల్- 2023 షెడ్యూల్ విడుదల.. మార్చి 31న ప్రారంభం

IPL 2023: IPL -2023 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 21 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో సీజన్ ఆరంభం కానుంది. ఏప్రిల్ 1న పంజాబ్ వర్సెస్ కోల్‌కతా, లఖ్‌నవూ వర్సెస్ ఢిల్లీ తలపడనున్నాయి. ఏప్రిల్ 2న సన్ రైజర్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లో మ్యాచ్ జరగనుంది. మే 28న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో 12 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి IPLలో మొత్తం 70 మ్యాచ్‌లుంటాయి. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక ఐపీఎల్‌లో పాల్గొననున్న జట్లలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. హోంగ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు, బయట ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

Jyothi

Jyothi

Next Story