IPL 2023 SRH Vs RR: రాజస్తాన్‌ చేతిలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి

IPL 2023 SRH Vs RR: ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే పరాభవాన్ని చవిచూసింది సన్ రైజర్స్ హైదరాబాద్.

Arun Chilukuri
Published on: 2 April 2023 8:00 PM IST
IPL 2023 Rajasthan Royals Beats Sunrisers by 72 Runs
X

IPL 2023 SRH Vs RR: రాజస్తాన్‌ చేతిలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి

IPL 2023 SRH Vs RR: ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే పరాభవాన్ని చవిచూసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 72 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. రాజస్థాన్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సన్ రైజర్స్ తడబడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేయగా మిగిలిన బ్యాటర్లు కూడా రాణించలేదు. దీంతో 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేయగలిగింది సన్ రైజర్స్. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు, బౌల్ట్ 2వికెట్లు, హోల్డర్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఇక 22 బంతుల్లో 54 పరుగులు చేసిన రాజస్థాన్ బ్యాట్స్ మెన్ బట్లర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story