IPL 2023: ఎక్కడ మొదలైందో.. అక్కడే ముగింపు

IPL 2023: ఐపీఎల్ 2023 క్లైమాక్స్ కు చేరుకుంది.

Jyothi
Updated on: 27 May 2023 6:00 PM IST
IPL 2023 Finals: CSK VS GT Ends Where It Started
X

IPL 2023: ఎక్కడ మొదలైందో.. అక్కడే ముగింపు

IPL 2023: ఐపీఎల్ 2023 క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం జరగబోయే ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఫైనల్ పోరు నేపథ్యంలో ఆసక్తికర విషయం ఒకటి అందర్ని ఆకట్టుకుంటోంది. తొలి పోరు ఎక్కడ ప్రారంభం అయిందో ఏ టీముల మధ్య మొదలైందో ..అదే వేదికపై అవే టీములు కప్ కోసం తలపడనుండడంతో ఈ ఐపీఎల్ 2023 ప్రత్యేకంగా నిలిచింది.

ఈ సీజన్ లో తొలి మ్యాచ్ మార్చి 31న నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ – సీఎస్కేల మధ్య జరిగింది. లీగ్, క్వాలిఫయింగ్ మొత్తం కలుపుకొని మొత్తం 73 మ్యాచ్ లు జరగగా ఆఖరి మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే గుజరాత్, సీఎస్కేల మధ్యే జరగనుండడం విశేషం. ఈ విషయాన్ని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కొంతమంది నెటిజన్స్ తొలి మ్యాచ్ లో ఎలాంటి ఫలితం వచ్చిందో చివరి మ్యాచ్ లో కూడా అదే ఫలితం వస్తుందని అంటున్నారు. మరికొంతమంది అయితే ఎక్కడ ఎలా మొదలైనా సీఎస్కేనే విజయం సాధిస్తుందని కామెంట్స్ పెడుతున్నారు.

మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కి ముందు సీఎస్కే...గుజరాత్ టైటాన్స్ పై మొదటి మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే క్వాలిఫయర్ లో మాత్రం జీటీని ఓడించి సీఎస్కే టీమ్ ఫైనల్స్ కు చేరింది. ఫైనల్ లో సీఎస్కే గెలిస్తే ఐదోసారి టైటిల్ విన్నర్ గా నిలుస్తుంది. గుజరాత్ గెలిస్తే వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన టీమ్ గా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంటుంది. మరి, తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Jyothi

Jyothi

Next Story