IPL 2021 Points Table: KKR టీమ్‌కి ఊరట

IPL 2021 Updated Points Table After PBKS Vs KKR Match
x

ఐపీఎల్ పాయింట్ల టేబుల్ (ట్విట్టర్)

Highlights

IPL 2021 Points Table: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరలా లాస్ట్ ప్లేస్ కి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా...

IPL 2021 Points Table: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరలా లాస్ట్ ప్లేస్ కి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిచింది. దీంతో కేకేఆర్ చివరి స్థానం నుంచి 5 స్థానానికి ఎగబాకింది. దాంతో.. 7 స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానానికి చేరింది.

పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 8 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 పాయింట్లు, ముంబయి ఇండియన్స్ 4 పాయికంట్లతో టాప్-4లో కొనసాగుతున్నాయి. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 పాయింట్లతో 5వ స్థానంలో చేరింది. ఆ తర్వాత చివరి మూడు స్థానాల్లో పంజాబ్ కింగ్స్ 4 పాయింట్లు, రాజస్థాన్ రాయల్స్ 4 పాయింట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పాయింట్లతో నిలిచాయి. లీగ్ దశలో మ్యాచ్‌లు ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్న సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్ వేదికగానే ఈ రోజు (మంగళవారం) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 10 పాయింట్లతో నెం.1 స్థానానికి ఎగబాకనుంది. ఓడిన జట్టు మూడో స్థానానికి పరిమితం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories