IPL 2021: ఐపీఎల్‌ నుంచి ఇద్దరు స్టార్‌ అంపైర్లు ఔట్‌.!

IPL 2021: భారత్‌కు చెందిన అంపైర్‌ నితిన్‌ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్‌ రీఫెల్‌ కూడా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నారు.

Kranthi
Published on: 30 April 2021 8:03 AM IST
IPL-2021 two Umpires out of Tournament due to Covid
X

IPL 2021:(File Image)  

IPL 2021: ఐపీఎల్‌ 2021 పై కరోనా ఎఫెక్ట్‌ కొనసాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఇండియాలో క‌రోనా కేసుల భ‌యానికి కొంద‌రు ప్లేయ‌ర్స్ టోర్నీ వ‌దిలి వెళ్లిపోగా.. తాజాగా ఇద్ద‌రు స్టార్ అంపైర్లు కూడా గుడ్‌బై చెప్పారు. భారత్‌కు చెందిన అంపైర్‌ నితిన్‌ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్‌ రీఫెల్‌ కూడా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నారు.

ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌ సభ్యులైన వీరిద్దరూ.. ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నితిన్‌ ఇంట్లో వాళ్లందరూ.. కరోనా బరినపడటంతో.. వారితో ఉండటం కోసమే తాను టోర్నీ నుంచి వైదొలిగిన్నట్లు తెలిపాడు. ఇక రీఫెల్‌ మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న విమాన రాకపోకల నిషేధం కారణంగా స్వదేశం వెళ్లిపోవడానికి సిద్దమైన్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్ద‌రి స్థానంలో ఇప్ప‌టికే కొంద‌రు స్థానిక అంపైర్ల‌ను బ్యాక‌ప్‌గా ఉంచింది బీసీసీఐ. మీన‌న్‌, రైఫిల్‌ల‌కు షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ల బాధ్య‌త‌ల‌ను వాళ్ల‌కు అప్ప‌గించ‌నుంది. క‌రోనా కార‌ణంగానే ఇండియ‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌తోపాటు ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ ఆండ్రూ టై, ఆడ‌మ్ జంపా, కేన్ రిచ‌ర్డ్‌స‌న్ టోర్నీ వ‌దిలి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పటికే రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆండ్రూ టై, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌లు ఐపీఎల్‌ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు.




Kranthi

Kranthi

Next Story