IPL 2021 RCB vs RR: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

IPL 2021 RCB vs RR: నేడు ముంబయి లోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది.

Venkata Chari
Updated on: 22 April 2021 7:09 PM IST
IPL 2021: Toss Won by Royal Challengers Bangalore And Choose Bowling
X

టాస్ గెలిచిన బెంగళూరు టీం (ఫొటో ట్విట్టర్)

IPL 2021 RCB vs RR: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు (గురువారం) ముంబయి లోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది. ఈ మేరకు టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ తీసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ అన్నింటిలోనూ విజయం సాధించి ఫుల్ పామ్ లో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లాడి.. రెండింటిలో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలని రాజస్థాన్ ఆరాటపడుతోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.

ప్లేయింగ్ లెవన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, కైల్ జామిసన్, కేన్ రిచర్డ్సన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజు సామ్సన్ (కెప్టెన్, కీపర్), శివం దుబే, డేవిడ్ మిల్లెర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

Venkata Chari

Venkata Chari

Next Story