logo
క్రీడలు

IPL 2021 KKR vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

Toss Won by Kolkata Knight Riders and Choose Bowling
X

టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీం (ఫొటో ట్విట్టర్)

Highlights

IPL 2021 KKR vs CSK : నేడు రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.

IPL 2021 KKR vs CSK : ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మేరకు టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం బౌలింగ్ ఎంచుకుంది.

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, మంచి ఊపులో ఉంది.

మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫస్ట్ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచినా.. ఆ తర్వాత వరుసగా ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి, తిరిగి ఫాంలోకి రావాలని ఆరాటపడుతోంది.

ప్లేయింగ్ లెవన్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబతి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), సామ్ కుర్రాన్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్

కోల్‌కతా నైట్‌రైడర్స్: నితీష్ రానా, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నగర్‌కోటి, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ

Web TitleIPL 2021: Toss Won by Kolkata Knight Riders and Choose Bowling
Next Story