IPL 2021: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్.. నటరాజన్ కు కరోన పాజిటివ్

Sandeep Reddy
Updated on: 22 Sept 2021 4:00 PM IST
IPL 2021 Sunrisers Hyderabad Team Player Natarajan Tested Covid Positive
X

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్.. నటరాజన్ కు కరోన పాజిటివ్

IPL 2021 Sunrisers Hyderabad - Natarajan: ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ లో భాగంగా ఇటీవలే ప్రారంభం అవగా నేడు బుధవారం సన్ రైజర్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే ఇప్పటికే కరోనా కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ కు మరోసారి కరోనా షాక్ ఇచ్చింది. బుధవారం జరగబోయే మ్యాచ్ ముందు సన్ రైజర్స్ జట్టు ఆటగాడైన నటరాజన్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.

తాజాగా బిసిసిఐ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. సన్ రైజర్స్ జట్టులో నటరాజన్ కి పాజిటివ్ రావడం నిజమేనని అయితే అతనితో పాటు సన్నిహితంగా ఉన్న విజయ్ శంకర్ తో పాటు మరొక అయిదు మంది ఆటగాళ్ళను ఐసోలేషన్ లో ఉన్నారని, మిగిలిన వారికి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ రావడంతో సన్ రైజర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ యధావిధిగా కొనసాగుతుందని బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story