IPL 2021: సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్

IPL 2021 Starts on September 19th in Dubai
x
ఐపీఎల్ (ఫొటో ట్విట్టర్)
Highlights

IPL 2021: క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.

IPL 2021: క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ప్రభావంతో నిరవధికంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను మరలా మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఈ రోజు బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. ఇక ఫైనల్ మ్యాచ్‌ను ఆక్టోబర్ 10 న నిర్వహించనున్నట్లు తెలిపింది. పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.

కాగా, ఇండియా టీం ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్‌లో ఉంది. అనంతరం జూన్ 2న ఇంగ్లాండ్ పయణం కానుంది. మొదట న్యూజిలాండ్‌తో డబ్యూటీసీ ఫైనల్ ఆడుతుంది. అనంతరం ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్ అయ్యాక నేరుగా దుబయి కి వెళ్తుందని బీసీసీఐ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories