IPL 2021 RR vs KKR : రెండు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా

IPL 2021 RR vs KKR : రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐదో మ్యాచ్‌లో తలపడతున్నాయి.

Samba Siva Rao
Updated on: 24 April 2021 8:26 PM IST
KKR Batting
X

కెకెకె ఆర్ ఫైల్ ఫోటో  

IPL 2021 RR vs KKR : ఐపీఎల్ 2021సీజన్ లో రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐదో మ్యాచ్‌లో తలపడతున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌ ఆరంభించిన కోల్‌కతా కొద్దీ సేపటికే ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌(11) వికెట్ చేజార్చుకుంది. ముస్తాఫిజుర్‌ వేసిన ఈ ఓవర్‌లో సింగిల్‌ కోసం ప్రయత్నించి గిల్‌ రనౌటయ్యాడు.10 ఓవర్ల ముగిసేసమయానికి కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా(22)పరుగుల వద్ద చేతన్ బౌలింగ్ లో శాంసన్ క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. రాహుల్‌ త్రిపాఠి(13), సునీల్ నరేన్(6) పరుగలుతో క్రీజులో ఉన్నారు.

ఇప్పటికే ఇరు జట్లూ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒకే విజయం సాధించి మూడు ఓటములతో కొనసాగుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయిట్ల పట్టికలో ముందుకు సాగాలని భావిస్తున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story