IPL 2021 RR vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

IPL 2021 RR vs DC : ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది.

Venkata Chari
Updated on: 15 April 2021 7:07 PM IST
IPL 2021 RR vs DC: Rajasthan Royals vs Delhi Capitals
X

సంజూ శాంసన్, పంత్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021 RR vs DC: ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్థాన్ రాయల్స్ హోరాహోరీ పోరుకు వేళయింది. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ని చిత్తుగా ఓడించేసింది ఢిల్లీ క్యాపిటల్స్‌. అలాగే పంజాబ్ కింగ్స్‌కి చివరి బాల్ దాకా ముచ్చెమటలు పట్టించేసింది రాజస్థాన్ రాయల్స్. రెండు టీంలలోనూ టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

ప్లేయింగ్ లెవన్

రాజస్థాన్ రాయల్స్: మనన్ వోహ్రా, సంజు సామ్సన్ (కెప్టెన్, కీపర్), డేవిడ్ మిల్లెర్, జోస్ బట్లర్, శివం దుబే, రియాన్ పరాగ్, రాహుల్ తివాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), అజింక్య రహానె, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, టామ్ కుర్రాన్, అవేష్ ఖాన్

Venkata Chari

Venkata Chari

Next Story