IPL 2021 - RCB vs KKR: నేడు కలకత్తా నైట్ రైడర్స్ తో రాయల్ "ఛాలెంజ్"

* నేడు ప్లేఆఫ్ మ్యాచ్ లో తలపడనున్న కలకత్తా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు

Sandeep Reddy
Updated on: 12 Oct 2021 10:40 AM IST
IPL 2021 Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Play Off Match Today 11 10 2021
X

IPL 2021 - RCB vs KKR: నేడు కలకత్తా నైట్ రైడర్స్ తో రాయల్ "ఛాలెంజ్" (ఫోటో: ఐపీఎల్)

RCB vs KKR: ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం మొదలైన ప్లేఆఫ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మొదటి ప్లేఆఫ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించి ఫైనల్ కి చేరిన సంగతి తెలిసిందే. ఇక ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేడు (సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - కలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్ లో గెలుపొందిన జట్టుతో ఫైనల్ లో బెర్త్ కోసం తలపడనుంది.

తాజాగా సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ కి అటు బెంగుళూరు, కలకత్తా జట్లు హోరాహోరి పోటీకి సిద్దమయ్యాయి. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న బెంగుళూరు జట్టు ఈ ఏడాది సీజన్ తో కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్న విరాట్ కోహ్లికి ఎలాగైనా టైటిల్ ని గెలిచి బహుమతిగా ఇవ్వాలని బెంగుళూరు జట్టు తహతహలాడుతుంది.

మరోపక్క కలకత్తా జట్టు కూడా ఈ ఏడాది టైటిల్ ని గెలిచి మూడోసారి టైటిల్ ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో మోర్గాన్ సేన ఈరోజు మ్యాచ్ లో బరిలోకి దిగనుంది. మరి ఈరోజు మ్యాచ్ లో నెగ్గి టైటిల్ రేసులో ఎవరు ముందడుగు వేయనున్నారో చూడాల్సిందే..!!

ఇరు జట్ల తుది వివరాలు ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి..

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు: విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్, డేనియల్ క్రిస్టియన్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, షహబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.

కలకత్తా నైట్ రైడర్స్: శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్, షకీబ్ అల్ హసన్/ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

Sandeep Reddy

Sandeep Reddy

Next Story