IPL 2021: బెంగళూరు లక్ష్యం 160

IPL 2021: ముంబై ఇన్నింగ్స్ ముగిసింది.

Samba Siva Rao
Published on: 9 April 2021 9:43 PM IST
IPl2021
X

IPL2021

IPL 2021: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ధనాధన్ ఎంటర్‌టైన్మెంట్ షురూ ఐపోయింది. చెన్నై చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాపింయన్ ముంబై, ఆర్సీబీ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగుల చేసింది. 5 వికెట్లతో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించాడు. ముంబై జట్టులో రోహిత్ 19 పరుగులకే వెనుదిరగగా.. క్రిస్ లిన్ 49పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. లిన్ తర్వాత 31 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదనిపించాడు.

మరోవైపు.. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఐపీఎల్‌ను పరిమిత వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. మొత్తం 8జట్లు పాల్గొంటున్న తాజా సీజన్‌లో 60మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికితోడు ఏ జట్టుకూ సొంత గడ్డపై ఆడే అవకాశం లేకపోవడంతో ఈ సీజన్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story