IPL 2021 PBKS vs CSK: చెన్నై టార్గెట్‌ 107‌‌‌‌‌

IPL 2021 PBKS vs CSK: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అత్యంత దారుణ ప్రదర్శన చేసింది.

Arun Chilukuri
Updated on: 16 April 2021 9:28 PM IST
IPL 2021 PBKS vs CSK: చెన్నై టార్గెట్‌ 107‌‌‌‌‌
X

IPL 2021 PBKS vs CSK: చెన్నై టార్గెట్‌ 107‌‌‌‌‌

IPL 2021 PBKS vs CSK: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అత్యంత దారుణ ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 106 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. ఒక ద‌శ‌లో 26 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన పంజాబ్‌ను షారుక్ ఆదుకున్నాడు. ఐపీఎల్ అనుభ‌వం పెద్ద‌గా లేక‌పోయినా ఎంతో ప‌రిణతితో అత‌డు ఆడాడు.

కెప్టెన్ రాహుల్ (5) స‌హా మ‌యాంక్ అగ‌ర్వాల్ (0), గేల్ (10), పూర‌న్ (0)లాంటి స్టార్లు వెంట వెంట‌నే వెనుదిరిగినా.. షారుక్ మాత్రం 36 బంతుల్లో 47 ప‌రుగులు చేసి పంజాబ్ స్కోరును 100 దాటించాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అత‌నికి దీప‌క్ హుడా (10), జై రిచ‌ర్డ్‌స‌న్ (15) కాస్త స‌హ‌క‌రించారు. చివరికి చెన్నై ముందు 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బౌలర్లలో చాహర్‌ 4 వికెట్లు పడగొట్టగా, సామ్‌ కర్రన్‌, మొయిన్‌ అలీ, బ్రావో తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఫీల్డ్‌లో పాదరసంలా కదిలిన జడేజా రెండు అద్భుతమైన క్యాచ్‌లతో పాటు ఓ కళ్లు చెదిరే రనౌట్‌ చేసి పంజాబ్‌ వెన్నువిరిచాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story