IPL 2021: బాడీ బిల్డర్‌ పక్కన ఎవరో చిట్టెలుక.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

IPL 2021:ఐపీఎల్ 2021 సీజన్‌లో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడింది.

Samba Siva Rao
Published on: 1 May 2021 5:09 PM IST
IPL 2021 PBKS Post a Hilarious Photo on Instagram of Their win Over RCB Using Chris Gayle
X

పంజాబ్ కింగ్స్ 

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ పంజాబ్ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు సాధించింది. రాహుల్ (91పరుగులు, 57 బంతులు, 7ఫోర్లు, 5సిక్సులు), గేల్(46 పరుగులు, 24 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు) రాణించిన సంగతి తెలిసిందే.

అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు. 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 145 మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ కోహ్లీ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రజత్ 31, హర్షల్ పటేల్ 31 తో రాణించారు. పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది పంజాబ్‌కు మూడో విజయం కాగా, పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్‌ ఆటగాళ్లు విజయోత్సవంలో ముగినిపోయారు. ఈ సందర్భంగా క్రిస్‌ గేల్‌-యజ్రేంద్ర చహల్‌లు తమ వంటిపై ఉన్న జెర్సీలు విప్పేసి మరీ హంగామా చేశారు. ఈ పిక్‌ను పంజాబ్‌ కింగ్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా, అది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్రిస్‌ గేల్‌-ఆర్సీబీ స్పిన్నర్‌ అయిన చహల్‌లు మంచి స్నేహితులు. అలానే వీరికి హడావుడి చేయడానికి ఏ అవకాశం వచ్చిన వదులుకోరు. జెర్సీలను విప్పేసి మరీ వారి కండలను చూపించారు. యూనివర్శల్‌ బాస్‌ గేల్‌ తన కండలను చూపిస్తూ పోజులిచ్చాడు. చహల్ బక్కగా ఉండడంతో బాడీ చూపించడానికి కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. బోన్స్ వర్సెస్ ఆర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story