IPL 2021: ముంబై‌తో తొలి పోరుకు సిద్దమైన కోహ్లీ సేన ఇదే!

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌‌ మరి కొద్ది గంటల్లో ఆరంభం కానుంది.

Samba Siva Rao
Updated on: 8 April 2021 8:46 PM IST
ipl 2021 rcb Team
X
RCB Team 

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌‌ మరి కొద్ది గంటల్లో ఆరంభం కానుంది. మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ విజయంతో ఈ ఐపీఎల్ జర్నీని ప్రారంభించాలని ఇరు జట్ల తహతహలాడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బరిలోకి దిగే తుది జట్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఓపెనర్‌ దేవదత్ పడిక్కల్ ఈ సీజన్‌కు ముందు కరోనా వైరస్ బారిన పడడంతో అందరిలో ఆందోళన మొదలైంది. అతను కరోనా నుంచి పూర్తిగా కోలుకొని టీమ్ క్యాంప్‌లో కలిసాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా రాణించిన కోహ్లీ ఐపీఎల్‌లో కూడా ఇన్నింగ్స్ ఆరంభిస్తానని తెలిపాడు. ఈ క్రమంలో పడిక్కల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

తుదిజట్టు :

విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ అజారుద్దీన్(కీపర్), డాన్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీసన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ సచిన్ బేబీ

Samba Siva Rao

Samba Siva Rao

Next Story