IPL 2021 MI vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

IPL 2021: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది.

Arun Chilukuri
Updated on: 1 May 2021 7:50 PM IST
IPL 2021: Mumbai Indians have won the Toss and they will Bowl First Against CSK
X

IPL 2021 MI vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

IPL 2021: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. ఢిల్లీ వేదికగా రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్‌ గెలిచి ముంబయి ఇండియన్స్‌ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన ధోనీ సేన ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక ముంబయి ఇండియన్స్‌ విషయానికొస్తే.. ఆరు మ్యాచులాడిన రోహిత్‌ సేన 3 మ్యాచుల్లో గెలవగా మరో మూడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్‌ డికాక్‌‌, సూర్యకుమార్ యాదవ్, నాథన్‌ కౌల్టర్‌ నీల్‌, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్‌ నీషమ్‌, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

సీఎస్‌కే: డుప్లెసిస్‌, రుతురాజ్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్‌ ధోని, రవీంద్ర జడేజా, లుంగీ ఎన్గిడి, సామ్‌ కర్రన్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌




Arun Chilukuri

Arun Chilukuri

Next Story