IPL 2021: మరో మైలురాయి ముంగిట రోహిత్

IPL 2021:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2021, 14 ఎడిషన్ క్రికెట్ అభిమానులను వీపరీతంగా అలరిస్తుంది.

Samba Siva Rao
Published on: 17 April 2021 4:04 PM IST
Rohit Sharma Mumbai Indians
X

రోహిత్ ఫైల్ ఫోటో

IPL 2021:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2021, 14 ఎడిషన్ క్రికెట్ అభిమానులను వీపరీతంగా అలరిస్తుంది. ప్రేక్షకులు గ్రౌండ్ లో లేకపోయినా..ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. దీంతో క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మరో ఆసక్తికరపోరుకు తెరలేచింది. చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ముంబై సారథి రోహిత్ ముగింట మరో అద్భుతమైన రికార్డ్ నిలిచివుంది. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ పోరులో ఇంకో 28 పరుగులు చేస్తే, టీ20ల్లో కెప్టెన్‌గా 4వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన డేవిడ్‌ వార్నర్‌ నాయకత్వంలోని సన్‌రైజర్స్‌ సీజన్‌లో బోణీ చేయాలని పట్టుదలతో ఉంది.

ఐపీఎల్‌ చరిత్రలో హిట్‌మ్యాన్‌ ఇప్పటి వరకు 202 మ్యాచ్‌ల్లో 5292 పరుగులు పూర్తి చేశాడు. అత్యధిక స్కోరు 109 కాగా, 39 అర్ధశతకాలు నమోదు చేశాడు. ఫామ్‌లో ఉన్న రోహిత్‌..సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చెలరేగాలని భావిస్తున్నాడు. మరోవైపు వార్నర్ సేన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేయాననే పట్టుదలతో ఉంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ సాహాని తప్పించాలని భావిస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story