IPL 2021 MI vs SRH: ముంబైని కట్టడి చేసిన సన్‌రైజర్స్‌

IPL 2021 MI vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2021 చెన్నై వేదికగా హైదరాబాద్ - ముంబై మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Samba Siva Rao
Updated on: 17 April 2021 9:32 PM IST
IPL 2021 MI vs SRH: ముంబైని కట్టడి చేసిన సన్‌రైజర్స్‌
X

IPL 2021 MI vs SRH: మంబైని కట్టడి చేసిన సన్‌రైజన్స్ 

IPL 2021 MI vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2021 చెన్నై వేదికగా హైదరాబాద్ - ముంబై మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల ముంబై భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఈ మ్యాచ్ లో ముంబై ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(40; 39 బంతుల్లో 5x4), రోహిత్‌ శర్మ(32; 25 బంతుల్లో 2x2, 2x6) రాణించారు. ఇరువురు కలిసి తొలి వికెట్ కు 55 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. విజయ్ శంకర్ రోహిత్ శర్మను బోల్తా కొట్టించగా.. ముజీబ్ డికాక్ పెవిలియన్ చేర్చాడు.

ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. సూర్యకుమార్‌(10), ఇషాన్‌ కిషన్‌(12), హార్దిక్‌ పాండ్య(7) ధాటిగా ఆడే క్రమంలో స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. అయితే, చివర్లో పొలార్డ్‌(35*; 22 బంతుల్లో 1x4, 3x6) విద్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగడంతో ముంబై150 పరుగులు చేసింది. కృనాల్‌‌ పాండ్య(3) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, విజయ్‌ శంకర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story