IPL 2021 MI vs CSK: రాయుడు సూపర్ బ్యాటింగ్.. ముంబై ముందు భారీ స్కోరు

IPL 2021 MI vs CSK: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది.

Arun Chilukuri
Updated on: 1 May 2021 9:55 PM IST
IPL 2021 MI vs CSK: MI need 218 runs in 20 overs to win
X

IPL 2021 MI vs CSK: అదరగొట్టిన చెన్నై.. ముంబై ముందు భారీ స్కోరు

IPL 2021 MI vs CSK: ఐపీఎల్ 2021లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్..నిర్ణీత ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్(4)ని తొలి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్‌ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ (50; 28 బంతుల్లో 2×4, 1×6), మొయిన్‌ అలీ (58; 36 బంతుల్లో 5×4, 5×5) రాణించారు. ధాటిగా ఆడుతున్న అలీ బుమ్రా బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత ఓవర్లోనే డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా(2)లను పొలార్డ్‌ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (72; 27 బంతుల్లో 3×4; 7×6) సిక్సర్లతో విరుచుపడ్డాడు. జడేజా 22 పరుగులు చేశాడు. దీంతో చెన్నై భారీ స్కోరును సాధించింది.

ముంబై బౌలర్లలో పొలార్డ్‌ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా చెరో వికెట్‌ తీశారు. చెన్నై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన చెన్నై..చివర్లో ముంబై బౌలర్లకు రాయుడు చుక్కలు చూపించాడు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story