IPL 2021- KKR vs DC: చెమటోడ్చి నెగ్గిన కోల్‌కతా నైట్‌ రైడర్స్

*136 పరుగుల టార్గెట్‌ను చివరి ఓవర్‌లో ఛేదించిన కేకేఆర్ *చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టి, జట్టును గెలిపించిన రాహుల్‌ త్రిపాఠి

Shilpa
Published on: 14 Oct 2021 6:53 AM IST
IPL 2021 Kolkata Knight Riders Won The Match Against Delhi Capitals in KKR vs DC Play Off Match
X

కోల్‌కతా నైట్‌ రైడర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ (ఫైల్ ఫోటో)

IPL 2021- KKR vs DC: చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ చెమటోడ్చి నెగ్గింది. ఢిల్లీ జట్టు ఇచ్చిన 136 పరుగుల టార్గెట్‌ను ఏడు వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌లో ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఓటమి పాలైన ఢిల్లీ ఇంటిబాట పట్టింది. కోల్‌కతా ఓపెనర్‌ వెంకటేశ్ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ 46 రన్స్‌తో రాణించాడు. టార్గెట్‌ తక్కువే అయినప్పటికీ వరుసగా వికెట్లు పడడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్‌లో కేకేఆర్‌కు 7 రన్స్ అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన అశ్విన్ వరుస బంతుల్లో షకిబ్‌ అల్ హసన్‌, సునీల్ నరైన్ ను డకౌట్ చేశాడు. దీంతో జట్టు విజయానికి ఆరు పరుగులు కావాల్సివచ్చింది. కానీ చేతిలో రెండే బాల్స్‌ ఉన్నాయి. మ్యాచ్‌ ఎవరు గెలుస్తారనే టెన్షన్‌ అందరిలో కనిపించింది కానీ క్రేజ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి కూల్‌గా సిక్స్ బాదేశాడు.

Shilpa

Shilpa

Next Story