Shivam Mavi Viral Video: పృథ్వీ పై సరదాగా రివేంజ్ తీర్చుకున్న శివమ్ మావి

Shivam Mavi vs Prithvi Shaw: నిన్న రాత్రి కేకేఆర్ తో మ్యాచ్‌లో డీసీ ‎ఓపెనర్ పృథ్వీ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 30 April 2021 4:15 PM IST
KKR Fast Bowler Shivam Mavi Takes Revenge After Prithvi Shaw  Hits him for 6 Fours
X

సరదా సన్నివేశం; పృథ్వీ ఆరు ఫోర్లకు రివేంజ్ తీర్చుకున్న శివమ్ మావి (ఫొటో ట్విట్టర్)

Shivam Mavi vs Prithvi Shaw: నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ‎ఓపెనర్ పృథ్వీ షా వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి కెరీర్ ని ఒకే ఓవర్‌లో ప్రమాదంలో పడేసేలా చేశాడు.

శివమ్ మావీ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే పృథ్వీ షా వరుసగా ఆరు ఫోర్లు కొట్టేశాడు. ఆ ఓవర్‌లో అతను ఓ వైడ్‌ కూడా విసిరాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు పృథ్వీ షా. దీంతో శివమ్ మావితో మరో ఓవర్ వేసే సాహసం చేయలేక పోయాడు కేకేఆర్ కెప్టెన్. అంటే పృథ్వీ షా ఎంతలా ఉతికి ఆరేశాడో అర్థమవుతోంది.

అయితే, నిజానికి పృథ్వీ షా, శివమ్ మావి బెస్ట్ ఫ్రెండ్స్. 2018లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో పృథ్వీ షా కెప్టెన్సీలోనే శివమ్ మావి ఆడాడు. ఆ టోర్నీలో భారత్ కప్ గెలుచుకోవడంలో శివమ్ మావి కూడా క్రియాశీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతోనే పృథ్వీ షా సునాయసంగా ఆరు ఫోర్లు కొట్టేసినట్లు కామెంటేటర్లు వివరణ ఇచ్చుకొచ్చారు. ఈ మేరకు ట్విట్టర్లో ఐపీఎల్ ది బ్యూటీ ఆఫ్ #VIVOIPL అంటూ ఓ వీడియోని షేర్ చేసింది.

ఈ వీడియోలో ఏమందంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత పృథ్వీ షా ఎదురుపడగానే.. శివమ్ మావి అతని మెడపై చేయి వేసి గట్టిగా నొక్కుతూ బదులు తీర్చుకున్నట్లు కనిపించాడు. పృథ్వీ షా నొప్పితో అరుస్తున్నా.. అలానే కాసేపు ఏడిపించాడు. పక్కనే ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ హెచ్చరించడంతో వదిలేశాడు.

పృథ్వీ షా దూకుడుగా ఆడే స్వభావం కలవాడు. కానీ.. కోల్‌కతాపై మాత్రం ఊచకోత కోశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. పృథ్వీ షా.. మొత్తంగా 41 బంతుల్లో 11x4, 3x6 సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Venkata Chari

Venkata Chari

Next Story