IPL 2021: ఐపీఎల్‌ నిరవధిక వాయిదా

IPL 2021 : IPL suspended for this season
x

IPL 2021: ఐపీఎల్‌ నిరవధిక వాయిదా!

Highlights

IPL 2021: ఐపీఎల్‌-14వ సీజన్‌కు కరోనా సెగ తాకింది.

IPL 2021: ఐపీఎల్‌-14వ సీజన్‌కు కరోనా సెగ తాకింది. ఐపీఎల్ 14వ సీజ‌న్‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడం, క్రికెటర్లకు కూడా కరోనా వైరస్ సోకడంతో ఐపీఎల్ 2021ను వాయిదా వేశారు. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్‌ బారిన పడ్డారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్‌ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇక కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో లీగ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories