IPL 2021: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ?

IPL 2021: మహారాష్ట్రలో కరోనా ఉధృతి నేపధ్యంలో ముంబై నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు తరలించే అవకాశం కనిపిస్తోంది.

Arun Chilukuri
Published on: 3 April 2021 7:11 PM IST
IPL 2021: Hyderabad kept as standby venue for IPL
X

IPL 2021: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ?

IPL 2021: మహారాష్ట్రలో కరోనా ఉధృతి నేపధ్యంలో ముంబై నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు తరలించే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌లను హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపధ్యంలో బీసీసీఐ మ్యాచ్‌ల నిర్వహణపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వాంఖడే స్టేడియంలోని పలువురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. సిబ్బందికి మరోసారి టెస్టులు నిర్వహించి మ్యాచ్‌లను మార్చాలా వద్దా అనే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ మ్యాచ్‌లను మార్చాలని బీసీసీఐ భావిస్తే ముంబైలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌లకు హైదరాబాద్ వేదిక కానుంది. అటు మ్యాచ్‌ల నిర్వహణకు హైదరాబాద్ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story