IPL 2021: సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

IPL 2021: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 లో ఎస్‌ఆర్‌హెచ్ టీం కెప్టెన్ డేవిడ్ వార్నర్ పాల్గొంటున్నాడు.

Venkata Chari
Published on: 30 March 2021 8:32 PM IST
IPL 2021: Good News For SRH Fans
X

డేవిడ్ వార్నర్ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

IPL 2021: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 లో ఎస్‌ఆర్‌హెచ్ టీం కెప్టెన్ డేవిడ్ వార్నర్ పాల్గొంటున్నాడు. ఈమేరకు ఇండియాకు బయలుదేరినట్లు ఆయన తన ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో అటు టీంతోపాటు ఫ్యాన్స్ లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. గజ్జల్లో గాయం కారణంగా తొలి విడత ఐపీఎల్ కు వార్నర్ దూరం అవ్వనున్నాడనే వార్తల నేపథ్యంలో... వార్నర్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు. ఇండియాకు బయలుదేరే ముందు తన కుటుంబంతో కలసి విందును ఎంజాయ్ చేసిన ఫొటోను షేర్ చేశాడు.

కాగా, లీగ్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లందరూ తమతమ జట్లలో జాయిన్ అవుతున్నారు. బీసీసీఐ రూల్స్ మేరకు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అందుకే విదేశీ ఆటగాళ్లంతా ముందే ఇండియాకు పయనమవుతున్నారు. చెన్నై వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఢీకొట్టనుంది. ఏప్రిల్‌ 11న ఇదే వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది.


Venkata Chari

Venkata Chari

Next Story