MI vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

* షార్జా వేదికగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ మ్యాచ్

Sandeep Reddy
Published on: 2 Oct 2021 3:22 PM IST
IPL 2021 Delhi Capitals won the Toss and elected to bowl first in MI vs DC Today 02 10 2021
X

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ (ట్విట్టర్ ఫోటో)

MI vs DC: ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరుకు షార్జా క్రికెట్ వేదిక సిద్దమైంది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, కలకత్తా నైట్ రైడర్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలుపొందటంతో 10 పాయింట్లతో ముంబై, కలకత్తా జట్లతో పాటు ప్లేఆఫ్ రేసులో నిలిచింది. తాజాగా ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టులోకి లలిత్ యాదవ్ స్థానంలో పృథ్వీ షా చేరాడు. మరోపక్క రాహుల్ చహార్ స్థానంలో జయంత్ యాదవ్ ముంబై జట్టు తరపున మ్యాచ్ లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయాన్ని సాధిస్తే పాయింట్ల పట్టికలో మొదటి, రెండు స్థానాల్లో నిలవనుంది. ఇక ముంబై ఇండియన్స్ ఈ రోజు ఢిల్లీతో గెలిస్తే ప్లేఆఫ్ కి క్వాలిఫై అవకాశాన్ని నిలుపుకోనుంది. ఇక ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, షిమ్రాన్ హెట్మెయర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (సి), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story